ఘనంగా వీర కొండమ్మ దేవత ఆలయ వార్షికోత్సవం

ABN , First Publish Date - 2022-08-20T04:45:54+05:30 IST

మండల కేంద్రంలో వెలసిన వీర కొండమ్మ దేవత వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది.

ఘనంగా వీర కొండమ్మ దేవత ఆలయ వార్షికోత్సవం
ప్రత్యేక అలంకరణలో వీర కొండమ్మ దేవత

వేముల, ఆగస్టు 19: మండల కేంద్రంలో వెలసిన వీర కొండమ్మ దేవత వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. బెంగుళూరు నుంచి తెప్పించిన పూలతో అమ్మ వారు విగ్రహాన్ని పురోహితుడు గోపీకృష్ణ ప్రత్యేకంగా అలంకరిం చారు. ఈ సందర్భంగా పంచా మృత అభిషేకం, కుంకుమార్చన, మహాగణపతి, లక్ష్మీనారాయణ దే వి సూక్తం, దుర్గా సూక్తం, రుద్ర హోమం, మహాపూర్ణాహుతి, మహానైవేద్యం, మహా మంగళహా రతి, తీర్థప్రసాద వినియోగాలు నిర్వహించారు. భక్తులకు అన్నదా నం ఏర్పాటు చేశారు. 


Updated Date - 2022-08-20T04:45:54+05:30 IST