గ్రామానికో క్రీడా ప్రాంగణం : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-25T06:19:23+05:30 IST

మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం కోసం ప్రభుత్వం గ్రామానికో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తోందని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.

గ్రామానికో క్రీడా ప్రాంగణం : కలెక్టర్‌
పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

ఎల్లారెడ్డిపేట, మే 24: మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం కోసం ప్రభుత్వం గ్రామానికో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తోందని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణ, పల్లె ప్రకృతి వనంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు మంగళవారం స్థలాన్ని పరిశీలించారు.   ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను పరిశీలించాలని, జూన్‌ 2లోగా ప్రాంగణాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. క్రీడా ప్రాంగణాలతో విద్యార్థులు, యువత ఆటలపై దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడా ఆణిముత్యాలను వెలుగులోకి తీసుకు వచ్చేలా కృషి చేస్తామన్నారు. పల్లె ప్రకృతి వనం వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, షటీల్‌ ఆటలకు అనువుగా ఉంటుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అడిషనల్‌ కలెక్టర్‌ సత్యప్రసాద్‌, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌, ఎంపీడీవో చిరంజీవి, ఆయా శాఖల అధికారులు, స్థానిక నాయకులు ఉన్నారు.

కోనరావుపేట : తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం కోసం కోనరావుపేట మండల కేంద్రంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, తహసీల్దార్‌ నరేందర్‌ మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. ఎంపీడీవో రామకృష్ణ, ఏపీవో శ్రీనివాస్‌, ప్యాక్స్‌ చైర్మన్‌లు బండ నర్సయ్య, రామ్మోహన్‌రావు, ఎంపీటీసీ నర్సింహచారి, సర్పంచ్‌ రేఖ, టీఆర్‌ఎస్‌ నాయకులు రాఘవరెడ్డి, మల్యాల దేవయ్య ఉన్నారు.

Updated Date - 2022-05-25T06:19:23+05:30 IST