Abn logo
Apr 18 2021 @ 00:28AM

గ్రామాన్నే పట్టా చేసుకున్నారు

చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్‌కు  వేణునగర్‌ గ్రామస్థుల వినతి

పెంబి, ఏప్రిల్‌ 17 : మండలంలో ఆదివాసీ గిరిజన గ్రామం వేణునగర్‌ను పెంబికి చెందిన గన్నారపు సురేందర్‌, రజిత అక్రమంగా రిజిస్ర్టేషన్‌ చేయించు కున్నారని తమకు న్యాయం చేయాలంటూ శనివారం పెంబి తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని గ్రామస్థులు అందజేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. 2000 సంవత్సరంలో పెంబికి వెళ్లి ప్రధాన రహదారి పక్కన మందపల్లికి చెందిన ముగ్గురు వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఎంపీ ప్రస్తుత టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి స్వంత ఖర్చులతో భూమిని కొనుగోలు చేయడంతో ఆ గ్రామానికి వేణునగర్‌ అనే పేరు పెట్టుకున్నారు. ఈ గ్రామంలో దాదాపు 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పెంబి చెందిన ఓ వ్యాపారి అసైన్డ్‌భూమిని పట్టాభూమిగా మార్చుకున్నారు. ధర ణి వచ్చిన అనంతరం సదరు భూమిదస్ర్తాలో ప్రస్తుతం అసైన్డ్‌భూమిగానే చూపు తోంది. వేణునగర్‌ ప్రస్తుతం నూతన గ్రామపంచాయతీ. గ్రామంలో మొత్తం భూ మి తనదేనంటూ సదరువ్యక్తి గ్రామస్థులతో చెప్పడంతో వారు ఖంగుతిన్నారు. గ్రామంలో నివాసస్థలాలను తన భూమిగా పట్టా చేసుకొని దానిపై సంవత్సరానికి రూ.1,47,500 రైతుబందు డబ్బులు సైతం పొందడం జరుగుతుందని గ్రామస్థులు అన్నారు. నివాసం ఉన్న భూమిపై డబ్బులు సదరు రైతుఖాతాలో జమ అవుతు న్నప్పటికీ ఈ విషయాన్ని వ్యవసాయాధికారులు సైతం గుర్తించకపోవడం విడ్డూ రంగా ఉందని అన్నారు. 


Advertisement
Advertisement