Advertisement
Advertisement
Abn logo
Advertisement

గ్రామాల పరిశుభ్రతకు ప్రజల సహకారం అవసరం

కొండాపురం, అక్టోబరు21: గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని జడ్పీటీసీ యల్ల్లావుల వెంకటరావు అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా శాయిపేటలో  గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ద్వారా పంచాయతీకి మంజూరయిన చెత్త సేకరణ యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి ఎల్‌. చెన్నకేశవులు, సర్పంచు పాలకీర్తి కోటేశ్వరమ్మ, ఎంపీటీసీ ఉన్నం గోవిందమ్మల ఆధ్వర్యంలో స్వచ్ఛ సంకల్ప ర్యాలీని నిర్వహించారు. మర్రిగుంటలో  సర్పంచు దార్లగోపి, పంచాయతీ కార్యదర్శి భాస్కర్‌, సచివాలయ సిబ్బంది స్వచ్ఛసంకల్పాన్ని నిర్వహించారు.  కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లు, అంగన్‌వాడీలు, గ్రామస్థులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement