అభివృద్ధికి గ్రామసభలు పట్టుగొమ్మలు

ABN , First Publish Date - 2021-04-16T04:39:29+05:30 IST

గ్రామీణాభివృద్ధికి గ్రామసభలు పట్టుగొమ్మలని జనసేన నాయకుడు కోనేటి హరిరాయల్‌ అన్నారు.

అభివృద్ధికి గ్రామసభలు పట్టుగొమ్మలు

కడప (రవీంద్రనగర్‌), ఏప్రిల్‌ 15: గ్రామీణాభివృద్ధికి గ్రామసభలు పట్టుగొమ్మలని జనసేన నాయకుడు కోనేటి హరిరాయల్‌ అన్నారు. గ్రామసభలు నిర్వహించాలని గురువారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గ్రామసభలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాలకు ఎన్ని నిధులు వచ్చాయో తెలుస్తుందన్నారు. పంచాయతీలో చేపట్టబోయే పనులపై గ్రామసభల్లో నిర్ణయించాలని, నీటి సమస్య, పారిశుధ్యం, వీధిదీపాలు, డ్రైనేజీ లాంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నా పంచాయతీ సెక్రటరీలు, సర్పంచ్‌లు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. జనసేన కడప జిల్లా యూత్‌ కింగ్‌ కో ఆర్డినేటర్‌ రమేష్‌, నందకిశోర్‌, ఈశ్వర్‌రెడ్డి, లక్షుమయ్య, సిద్దవటం రాజేష్‌, మాలిక్‌, దాదాపీర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T04:39:29+05:30 IST