ఆ అత్యంత పురాతన బ్యాంకులో ఏమి దాచేవారంటే..

ABN , First Publish Date - 2022-05-31T16:53:55+05:30 IST

బ్యాంకులు మన నిత్య జీవితంలో ప్రధాన..

ఆ అత్యంత పురాతన బ్యాంకులో ఏమి దాచేవారంటే..

బ్యాంకులు మన నిత్య జీవితంలో ప్రధాన భాగమైపోయాయి. అయితే శతాబ్దాల క్రితం నాటి బ్యాంకింగ్ వ్యవస్థ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. మొరాకో వరల్డ్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం శతాబ్దాల క్రితం మొరాకోలోని అమాజీ కమ్యూనిటీ ఉపయోగించిన బ్యాంకింగ్ వ్యవస్థను రబాత్-ఇగుడార్ అని పిలిచేవారు. ఇది ప్రపంచంలోనే పురాతన బ్యాంకుగా పేరొందింది. 


ఈ బ్యాంకు కార్యదర్శిని లామిన్ అని పిలిచేవారు. సుమారు 10 మంది వ్యక్తుల కమిటీ ఈ బ్యాంకును పర్యవేక్షించించేది. ఈ బ్యాంకులో గోధుమలు, బార్లీ, ఆభరణాలు, చట్టపరమైన పత్రాలను దాచేవారు. ఈ సామూహిక ధాన్యాగారాలు.. బ్యాంకుల ప్రారంభానికి సంకేతంగా నిలిచాయని రీసెర్చ్ ప్రొఫెసర్ ఖలీద్ అలరౌద్ తెలిపారు. 

Updated Date - 2022-05-31T16:53:55+05:30 IST