అకాల వర్షంతో తడిసిన ధాన్యం

ABN , First Publish Date - 2022-05-18T06:24:59+05:30 IST

మండలంలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురిచేసింది.

అకాల వర్షంతో తడిసిన ధాన్యం
నవాబ్‌పేట మండలం రుద్రారంలో తడిసిన ధాన్యం

నవాబ్‌పేట, మే 17: మండలంలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురిచేసింది. నవాబ్‌పేట, గురుకుంట, లోకిరేవ్‌, కారుకొండ, యన్మనగండ్ల, కూచూర్‌, చెన్నారెడ్డిపల్లి, ఇప్పటూర్‌, రుద్రారం తదితర గ్రామాల్లో మోస్తరు నుంచి భారీవర్షం కురవడంతో పలు గ్రామాల్లో ఆర బోసిన ధాన్యం తడిసింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొన్నారు. అకాలవర్షం వల్ల ఎక్కడైనా పంట నష్టం జరిగితె తమకు  సమాచారం ఇవ్వాలని మండల ఏవో రైతులకు తెలిపారు.

జడ్చర్లలో...

జడ్చర్ల : జడ్చర్లలో మంగళవారం సాయంత్రం మోస్తరుగా వర్షం కురి సింది. ఉదయం నుంచి ఉక్కపోత అధికంగా ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడిం ది. బాదేపల్లి మార్కెట్‌తో పాటు బాదేపల్లి పత్తి మార్కెట్‌లో ఆరుబ యట ఉన్న ధాన్యంపై రైతులు టార్పాలీన్‌లు కప్పి  జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 

దేవరకద్రలో..

దేవరకద్ర : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు మె రుపులతో కురిసిన వర్షానికి ప్రజలు చల్లబడ్డారు. పలు గ్రామాల్లో తమ పంటపొలాల దగ్గర ఆరబెట్టుకున్న ధాన్యం తడిసింది. 

హన్వాడలో..

హన్వాడ : మండలంలో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. హన్వాడ మండలంలోని వరి కొనుగోలు కేంద్రలకు వరి ధాన్యం తెచ్చిన రైతులు ఇబ్బందులు పడ్డారు. గాలి వీచడంతో కవర్లు కొట్టుకుపోయి కొన్ని చోట్ల వడ్లు తడిశాయి.

 

Updated Date - 2022-05-18T06:24:59+05:30 IST