Advertisement
Advertisement
Abn logo
Advertisement

తేమతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌ 


మిర్యాలగూడ, నవంబరు 30: అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. అవంతీపురం వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం ఎదుట మంగళవారం నిర్వహించిన ఽధర్నాలో ఆయన మాట్లాడారు. మార్కెట్‌కు రైతులు ధాన్యం తెచ్చి 25 రోజులు గడిచినా కొనుగోలు చేయకపోవడంతో గత వారంలో కురిసిన వర్షాలకు రాశులు తడిచి మొలకెత్తాయన్నారు. కొనుగోళ్లలో ప్రభుత్వం కాలయాపన చేస్తుండటం వల్లే రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకు బేషరుతుగా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ, తేమ శాతం ఎక్కువగా ఉందన్న కారణంతో ధరలో కోత విధించడం రైతులను దగా చేయడమేనన్నారు. యంత్రాల ద్వారా కోసిన ధాన్యంలో 20 శాతం కంటే తక్కువ తేమ ఎలా ఉంటుందో అధికారులు తెలపాలన్నారు. సరైన టార్ఫాలిన్లు ఇవ్వని అధికారులు తేమ శాతం గురించి మాట్లాడటం సరికాదన్నారు. మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, 1010, బీపీటీ, అన్నిరకాల ధాన్యాన్ని మద్దతుధరకు కొనుగోలు చేయలని, లేనిపక్షంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామన్నారు. అనంత రం మార్కెట్‌ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, పగిడి రామలింగయ్య, ముదిరెడ్డి నర్సిరెడ్డి, పొదిల శ్రీనివాస్‌, తమ్మరబోయిన అర్జున్‌, చెన్నబోయిన శ్రీనివాస్‌యాదవ్‌, ఎల్లారెడ్డి, బాలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement