ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

ABN , First Publish Date - 2021-10-21T06:21:10+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారం భించాలని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
దంతూరు గ్రామంలో ధాన్యం రాశులను పరిశీలిస్తున్న డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

భూదాన్‌పోచంపల్లి, అక్టోబరు 20: ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారం భించాలని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భూదాన్‌పోచంపల్లి మండలం దంతూరు గ్రామంలో ధాన్యం రాశులను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు.  రైతులు మళ్లీ సీజన్‌కు విత్తనాలు వేసుకునే సమయం వచ్చినా ప్రభుత్వం కొనుగోళ్లను ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.  వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిం చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పాక మల్లేష్‌యాదవ్‌, పట్టణ అధ్యక్షుడు గునిగంటి మల్లేష్‌యాదవ్‌, కిసాన్‌ కాంగ్రెస్‌  జిల్లా అధ్యక్షుడు మర్రి నర్సింహారెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ సామ మోహన్‌రెడ్డి, అనిరెడ్డి జగన్‌రెడ్డి, మన్నెం వెంకట్‌రెడ్డి, జమ్ము శంకరయ్య, కొత్త నర్సింహయాదవ్‌, సైదులుగౌడ్‌, పల్లెర్ల లక్ష్మయ్య యాదవ్‌, బోదాసు ఈదయ్య, దోటి శివకృష్ణ, గోరుకంటి సాయి తదితరులు పాల్గొన్నారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి: సీపీఐ

 మోటకొండూరు: మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ కోరారు. మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో బుధవారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.  మండ లంలోని కాటేపల్లి, నాంచారిపేట, కదిరేనిగూడెం గ్రామాల మీదుగా వెళ్లే బునాదిగాని కాల్వ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిచో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి గాదెగాని మాణిక్యం, అంబాల పాష, పెంటారెడ్డి, రాధ మ్మ, నర్సింహ, ఆలేటి బాలరాజు, లక్ష్మి, నాగులు, నరేందర్‌, పద్మ, పాండు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-21T06:21:10+05:30 IST