ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-12-04T07:26:34+05:30 IST

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పథి అన్నారు.

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
రాఘవపురంలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యాన్ని పరిశీలిస్తున్నకలెక్టర్‌ పమేలాసత్పథి

కలెక్టర్‌ పమేలా సత్పథి 

బీబీనగర్‌, డిసెంబరు 3: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పథి అన్నారు. మండలంలోని రాఘవపురం, రుద్రవెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆమె సందర్శించారు. తేమ యంత్రాన్ని పరిశీలించారు. రైతులను ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్యాబ్‌ ఎంట్రీని వెంటనే చేపట్టి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే లారీలను అన్‌లోడ్‌ చేసే విధంగా మిల్లుల యాజ మాన్యాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేయాలని సూచించారు. యా సంగి సీఎంఆర్‌ మిల్లింగ్‌ చేయాలని ఆదేశించారు. అనంతరం రహీం ఖాన్‌గూడ గ్రామంలోని నర్సరీ డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటిక పనులను పరిశీలించారు. ఆమె వెంట పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, సివిల్‌ సప్లై జీఎం గోపికృష్ణ, జిల్లా కోఆపరేటివ్‌ అధికారి పరిమత, ఎంపీడీవో శ్రీవాణి, ఎంపీవో స్వాతి, జిల్లా విజిలెన్స్‌ కమిటీ మానిటరింగ్‌ మెంబర్‌ మంచాల నరహరి పాల్గొన్నారు. 

సేంద్రియ ఎరువుల తయారీతో  ఆదాయాన్ని పెంచుకోవాలి 

భూదాన్‌పోచంపల్లి: ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ ద్వారా సేంద్రియ ఎరువులను గ్రామ పంచాయతీలు తయారు చేసి ఆదాయాన్ని పెంచుకోవా లని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు, జలాల్‌పూర్‌ గ్రామాల్లోని నర్సరీల్లో జరుగుతున్న పనులను, పల్లె ప్రకృతి వనాలు, కంపోస్టు యార్డులను ఆమె పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా కంపోస్టు యార్డులో తయారు చేసిన సేంద్రియ ఎరువు ప్యాకె ట్‌ను  పంచాయతీ కార్మికులు కలెక్టర్‌కు బహుమతిగా ఇవ్వగా, వారిని ఆమె అభినందించారు. అన్ని గ్రామాల్లో సేంద్రియ ఎరువుల ప్రక్రి యను ప్రారంభించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జలా  ల్‌పూర్‌ గ్రామంలో ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిం చారు. జూలూరు గ్రామంలో జడ్పీ హెచ్‌ఎస్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ‘పల్లె ప్రకృతి’ వనాన్ని సందర్శించారు. మొక్కల పెంపకం, సంరక్షణ చర్య లపై ఆరా తీశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో మాట్లా డుతూ కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో అడి షనల్‌ డీఆర్‌డీవో టి.నాగిరెడ్డి, ఎంపీడీవో ఎ.బాలశంకర్‌, తహసీల్దారు దశరథనాయక్‌, ఏపీవో కృష్ణ మూర్తి, ఎంపీవో మాజిద్‌ పాల్గొన్నారు. 

మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలి 

భువనగిరి రూరల్‌: హరితహారంలో మొక్కలు నాటేందుకు ప్రణా ళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదే శించారు. ఆన్‌లైన్‌ గూగుల్‌మీట్‌ ద్వారా వివిధ శాఖల అధికారులతో హరితహారం కార్యక్రమంపై శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో పెద్ద మొక్కలతో సిద్దం కావా లని సూచించారు. ఈ గూగుల్‌మీట్‌లో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌ రెడ్డి, డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌ రెడ్డి, డీపీవో సునంద, ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ కృష్ణప్రియ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అన్నపూర్ణ, వివిధ శాఖల అధికారులు , మునిసిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. 

మానసిక దివ్యాంగులకు ఆశ్రయం కల్పించడం అభినందనీయం

చౌటుప్పల్‌ టౌన్‌:  మానసిక దివ్యాంగులను ఆశ్రయం కల్పించడం అభి నందనీయమని కలెక్టర్‌ పమేలా సత్పథి అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్‌లోని అమ్మానాన్న అనాథాశ్రమంలో కేక్‌ కట్‌ చేసి ఆమె పంపిణీ చేశారు. శివాలయం ప్రాంగణంలో నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఆశ్రమ నిర్వాహకుడు గట్టు శంకర్‌ను కలెక్టర్‌ అభినందించారు. ఆశ్రమానికి పక్కా భవనాల నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నందున భూమిని కేటాయించాలని శంకర్‌ కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో సూరజ్‌ కుమార్‌, జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, డిప్యూటీ డీఎంహెచ్‌వో యశోద, సీడీపీవో శైలజ, సీహెచ్‌వో చంద్రశేఖర్‌, ఎంపీవో అంజిరెడ్డిలు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-04T07:26:34+05:30 IST