Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలి

వేగేశన నరేంద్రవర్మ


బాపట్ల: రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వేగేశన నరేంద్రవర్మ డిమాండ్‌ చేశారు. రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం పార్టీశ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ జి.శ్రీచరణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివర్‌ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు. పంటకాల్వలు, డ్రైనేజీలు మరమ్మతులు చేయించాలన్నారు.  రైతును ప్రభుత్వం విస్మరించటం దారుణమన్నారు. రైతులకు తగిన న్యాయం చేయాలని లేకుంటే టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్‌ నారాయణ, రాష్ట్రకార్యదర్శి సలగల రాజశేఖర్‌బాబు, పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి తానికొండ దయాబాబు, పరిశా రమేష్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ మానం విజేత, విన్నకోట వీరయ్యనాయుడు, పంగులూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement