క్రమంగా తగ్గుముఖం పట్టిన టమోటా ధరలు

ABN , First Publish Date - 2022-06-26T12:16:30+05:30 IST

గత నెల మొదటి వారంలో ఆకాశన్నంటిన టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రామకుప్పం, కుప్పం, పలమనేరు, ఏడోమైలు మార్కెట్లలో

క్రమంగా తగ్గుముఖం పట్టిన టమోటా ధరలు

చిత్తూరు: గత నెల మొదటి వారంలో ఆకాశన్నంటిన టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రామకుప్పం, కుప్పం, పలమనేరు, ఏడోమైలు మార్కెట్లలో 15 కిలోల బాక్సు శుక్రవారం వరకు రూ.400నుంచి రూ.450 వరకు పలికింది. ఈ ధర శనివారం రూ.350 నుంచి రూ.400కు పడిపోయాయి. ఇదే సమయంలో సోమల మార్కెట్‌లో 15కిలోల బాక్స్‌ ధర రూ.300 పలికింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అధిక దిగుబడులు రావడంతో పాటు జిల్లావ్యాప్తంగా రైతులు తాము పండించిన టమోటాలను మార్కెట్లకు తరలిస్తుండడంతో ధరలు తగ్గుతున్నాయి. వారం రోజుల క్రితం మచ్చలు కల్గిన, చిన్నసైజు కాయల బాక్సు రూ.250 నుంచి రూ.350 వరకు పలికింది. ప్రస్తుతం అటువంటి కాయల కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. బాక్సు ధర రూ.350 వరకు పలికితే పెట్టుబడి గిట్టుబాటై కాస్తోకూస్తో లాభాలు వస్తాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. టమోటా ధరలు తగ్గడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు.  ప్రస్తుతం కిలో రూ.30 నుంచి రూ.40 పలుకుతోంది.

Updated Date - 2022-06-26T12:16:30+05:30 IST