ఖాళీల భర్తీ ఎప్పుడు?

ABN , First Publish Date - 2020-03-12T06:14:42+05:30 IST

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలోని రెండు లక్షల అరవై వేల ఉద్యోగుల ఖాళీలను గత అక్టోబర్ మాసంలోగానే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంలో చెప్పారు. అలాగే ప్రతి సంవత్సరం...

ఖాళీల భర్తీ ఎప్పుడు?

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలోని రెండు లక్షల అరవై వేల ఉద్యోగుల ఖాళీలను గత అక్టోబర్ మాసంలోగానే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంలో చెప్పారు. అలాగే ప్రతి సంవత్సరం జనవరి మాసంలోనే శాఖలవారీగా ఖాళీలను ప్రకటించి, భర్తీ ప్రక్రియను చేపడతామని కూడా చెప్పారు. అయితే, ఆదిశగా ఖాళీల భర్తీ జరుగుతున్న దాఖలాలు లేవు. ఇప్పటికీ అన్ని శాఖలలో ఖాళీల మొత్తం రెండు లక్షల పైమాటే ! ప్రతి నెలా ఉద్యోగ విరమణ చేస్తున్నవారు 5 నుంచి 10 వేల వరకు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగులంతా ఉద్యోగాల కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి  ఖాళీల భర్తీపై ఓ స్పష్టమైన ప్రకటనచేసి, అందుకు అనుగుణంగా కార్యచరణ ప్రణాళిక రూపొందించాలి. ఉద్యోగాలు లేక యువత తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు పరిగణనలోకి తీసుకోవాలి. వెంటనే ఉద్యోగాలు భర్తీ చేసి ఆ ప్రమాదాన్ని నివారించాలి.


– జీఆర్‌, ఏలూరు

Updated Date - 2020-03-12T06:14:42+05:30 IST