Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 26 May 2022 13:25:23 IST

Gowtham Karthik హీరోగా ‘1947 ఆగస్టు 16’

twitter-iconwatsapp-iconfb-icon
Gowtham Karthik హీరోగా 1947 ఆగస్టు 16

యంగ్‌ హీరో గౌతమ్ కార్తీక్ (Gowtham Karthik) ‌, నూతన నటి రేవతి కాంబినేషన్‌లో కొత్త దర్శకుడు ఎన్‌.ఎస్ పొన్‌కుమార్‌ (NS Ponkumar) రూపొందిస్తున్న ‘1947 ఆగస్టు 16’ ( 1947, August 16) తమిళ చిత్రం ఫస్ట్‌లుక్‌ బుధవారం రిలీజ్‌ చేశారు. పర్పుల్‌ బుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌తో కలిసి ఏఆర్‌.మురుగదాస్‌ ప్రొడక్షన్స్‌ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. సుధీర్ఘకాలం పాటు తన వద్ద అసిస్టెంట్‌ డైరెక్టరుగా పనిచేసే ఎన్‌ఎస్ పొన్‌కుమార్‌ను దర్శకుడిగా మురుగదాస్‌ పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఇది స్వాతంత్య్ర పోరాట కథ కాదు. స్వేచ్ఛ అంటే ఏమిటి అని అర్థం చేసుకున్న అమాయక ప్రజల సమూహ కథ. వీరిలో ఒకరు.. ఎపుడు ఆవేశంగా దూకుడుగా ఉండే యువకుడే హీరో. లోతైన భావోద్వేగ సారాంశంతో గ్రిప్పింక్‌ స్ర్కీన్‌ప్లేతో తెరకెక్కిస్తున్నాం’ అని వివరించారు. 


దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ (AR Murugados) మాట్లాడుతూ.. ‘ఇది హృదయాన్ని హత్తుకునే నిజాయితీ స్టోరీ. ఒక్కసారి చూస్తే జీవితాంతం గుండెల్లో నిలిచిపోతుంది’ అని అన్నారు. రాష్ట్రంలోని పలు లొకేషన్లలో షూటింగ్‌ జరుకుంటుండగా, ఇవి చివరి దశకు చేరుకున్నాయి. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసి త్వరలోనే విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏఆర్‌.మురుగదాస్‌, ఓంప్రకాష్‌ భట్‌, నర్శిరాం చౌదరి నిర్మిస్తుండగా.. సహ నిర్మాతగా ఆదిత్య జోషి వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమా గౌతమ్ కార్తిక్ కు ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International