Abn logo
Jan 23 2021 @ 22:40PM

గౌడ జన హక్కుల పోరాట సమితి క్యాలెండర్‌ ఆవిష్కరణ

నారాయణపేట టౌన్‌, జనవరి 23 : గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ ఆధ్వ ర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో క్యాలెండర్‌ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుడు సత్యనారాయణ గౌడ్‌ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం కల్లు సొసైటీలను నిర్వీర్యం చేసిందన్నారు. కార్యక్రమంలో నర్సింహ గౌడ్‌, యాదయ్య గౌడ్‌, శంకర్‌ గౌడ్‌, వెంకటేష్‌ గౌడ్‌, సాయి గౌడ్‌, బుచ్చన్న, మల్లేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement