పిల్లలకు కరోనా చికిత్స..కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2021-06-13T01:29:12+05:30 IST

పిల్లలకు కరోనా చికత్సకు సంబంధించి కేంద్రం తాజాగా సవివరమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.

పిల్లలకు కరోనా చికిత్స..కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: పిల్లలకు కరోనా చికత్సకు సంబంధించి కేంద్రం తాజాగా సవివరమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటికి ప్రకారం.. పిల్లలకు రెమ్‌డెసివిర్ ఔషధం ఇవ్వరాదు. అంతేకాకుండా.. సీటీ స్కాన్ పరీక్ష విషయంలో కూడా వైద్యులు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. అవసరమనుకున్న సందర్భాల్లో మాత్రమే వైద్యులు ఈ పరీక్ష చేయించాలని సూచించాలి. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారులకు మాత్రమే స్టెరాయిడ్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. అవసరమైనుకుంటేనే యాంటీబయాటిక్‌లను పిల్లల కరోనా చికత్సలో భాగం చేయాలి. మరో బ్యాక్టిరియా ఇన్ఫెక్షన్ పిల్లల్లో ఉందని వైద్యులు భావిస్తేనే యాంటీబయాటిక్‌లు సూచించాల్సి ఉంటుంది. ఇక..పిల్లల్లో వ్యాధి తీవ్ర మధ్యస్థంగా ఉన్నా లేక అసలు కరోనా లక్షణాలే లేకున్నా కార్టికో స్టెరాయిడ్లు వినియోగించాల్సి అవసరం లేదు. వ్యాధి వేగంగా ముదురుతునప్పుడు, అదీ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే స్టెరాయిడ్లు వినియోగించాలని వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. 

Updated Date - 2021-06-13T01:29:12+05:30 IST