‘ఆక్వా’కు ఇబ్బంది రానివ్వం: మోపిదేవి

ABN , First Publish Date - 2020-03-27T08:39:59+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా చేపలు, రొయ్యల వంటి ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మత్స్యశాఖ...

‘ఆక్వా’కు ఇబ్బంది రానివ్వం: మోపిదేవి

అమరావతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కారణంగా చేపలు, రొయ్యల వంటి ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు గురువారం తెలిపారు. ఆక్వా రైతులు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. 


15 నుంచి చేపల వేట నిషేధం

రాష్ట్ర పరిధిలోని సముద్రంలో ఏప్రిల్‌ 15నుంచి జూన్‌ 14వరకు 61 రోజుల పాటు చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 


Updated Date - 2020-03-27T08:39:59+05:30 IST