ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త

ABN , First Publish Date - 2020-03-26T20:28:43+05:30 IST

కరోనా కల్లోలం నేపథ్యంలో సంక్షోభంలో చిక్కుకున్న సంఘటిత రంగానికి కేంద్రం ఆపన్న హస్తం అందించింది. ...

ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త

న్యూఢిల్లీ: కరోనా కల్లోలం నేపథ్యంలో సంక్షోభంలో చిక్కుకున్న సంఘటిత రంగానికి కేంద్రం ఆపన్న హస్తం అందించింది. ఈపీఎఫ్ ఖాతాదారులు, యాజమాన్యాల తరపున మూడు నెలల పాటు పీఎఫ్ మొత్తాన్ని కేంద్రమే చెల్లించనున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 90 శాతం మంది రూ.15 వేల లోపు జీతం కలిగిన ఉద్యోగులున్న సంస్థలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఉద్యోగుల వేతనాల్లో 24 శాతం మొత్తాన్ని మూడు నెలల పాటు కేంద్రం ఈపీఎఫ్‌కు జమచేస్తుందన్నారు. కాగా ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల నుంచి 75 శాతం లేదా మూడు నెలల జీతం ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు కూడా కేంద్రం వెసులుబాటు కల్పించింది. 

Updated Date - 2020-03-26T20:28:43+05:30 IST