బకాయిలు చెల్లించకపోతే... పాకిస్థాన్‌లోని చైనా కంపెనీల హెచ్చరిక

ABN , First Publish Date - 2022-05-11T00:12:40+05:30 IST

పాకిస్తాన్‌లో పనిచేస్తున్న దాదాపు 25 చైనీస్ కంపెనీలు రూ. 300 బిలియన్ల చెల్లింపులు తక్షణమే జరపనిపక్షంలో... ఈ నెలలో తమ కార్యకలాపాలను మూసివేయవలసి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించినట్లు మంగళవారం ఓ నివేదిక వెల్లడించింది.

బకాయిలు చెల్లించకపోతే...   పాకిస్థాన్‌లోని చైనా కంపెనీల హెచ్చరిక

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో పనిచేస్తున్న దాదాపు 25 చైనీస్ కంపెనీలు రూ. 300 బిలియన్ల చెల్లింపులు తక్షణమే జరపనిపక్షంలో... ఈ నెలలో తమ కార్యకలాపాలను మూసివేయవలసి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించినట్లు మంగళవారం ఓ నివేదిక వెల్లడించింది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC)లో ఫ్లాగ్‌షిప్ బహుళ-బిలియన్ డాలర్ల CPEC కింద పనిచేస్తున్న 30 కి పైగా చైనా కంపెనీలతో ప్రణాళిక/అభివృద్ధి మంత్రి అహ్సాన్ ఇక్బాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చైనా స్వతంత్ర విద్యుత్తు  ఉత్పత్తిదారుల(IPPs) ప్రకటన వెలువడింది.


విద్యుదుత్పత్తి కంపెనీలు 300 బిలియన్ పాకిస్థానీ రూపాయల(USD 15,95,920,800) బకాయిల చెల్లింపులకు సంబంధించి పలు ఫిర్యాదులను ప్రస్తావించాయి. చైనీస్ ఎగ్జ్సిక్యూటివ్‌లకు సంక్లిష్టమైన వీసా విధానాలు, పన్ను విధింపులు సహా ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అయితే వారి కమ్యూనికేషన్‌లకు ఆలస్యంగా ప్రతిస్పందించడంపై పాకిస్తాన్ వైపు నుండి కూడా కౌంటర్ ఫిర్యాదులు వచ్చినట్లు ఓ నివేదిక వెల్లడించింది. చైనీస్ IPPల నుండి దాదాపు 25 మంది ప్రతినిధులు మ ాట్లాడుతూ... బకాయిల గురించి ఫిర్యాదు చేయడంతోపాటు ముందస్తు సమాచారం లేకుండా మూసివేయనున్నట్లు హెచ్చరించారు. చైనా కంపెనీల చెబుతున్నదాని ప్రకారం... విద్యుత్తు బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతోపాటు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థికంగా తీవ్ర నష్టాలనెదుర్కోవాల్సి వచ్చింది. 

Read more