Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 9 2021 @ 18:11PM

పౌర విమానయాన ఊతానికి కేంద్రం కొత్త ప్లాన్

న్యూఢిల్లీ: పౌర విమానయానాన్ని మరింత మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 100 రోజుల పథకం పేరుతో ముందుకు వచ్చింది. ఆగస్టు 30 నుంచి నవంబర్ 30 వరకు దేశంలోని 16 ప్రధాన విమానాశ్రయాలతో పాటు మరో నాలుగు కొత్త విమానాశ్రయాలు, 8 నిర్మాణంలో ఉన్నవి, 4 పునర్ణిర్మాణంలో ఉన్న విమానాశ్రయాలకు మరిన్ని మెరుగులు దిద్ది మరింత ఆధునికంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా గురువారం తెలిపారు.


సంయుక్త సంప్రదింపుల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సింథియా తెలిపారు. దీనితో పాటు ఉడాన్ పథకం కింద హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆరు హెలిపాడ్లను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. నాలుగు కొత్త విమానాశ్రాయాల ఏర్పాటులో భాగంగా మొదటగా ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఎయిర్‌బస్ 321, బోయింగ్ 737 విమానాలు రాకపోకలు సాగించేలా ఈ విమానాశ్రయ నిర్మాణం జరగనున్నట్లు కేంద్ర మంత్రి సింథియా తెలిపారు.

Advertisement
Advertisement