కర్ణాటకలో ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ ఉపాధ్యాయుల చేయూత

ABN , First Publish Date - 2020-07-10T07:47:50+05:30 IST

కర్ణాటకలో ప్రైవేటు టీచర్లను ఆదుకోవడానికి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఒకరోజు వేతనం రూ.20 కోట్లను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 1.40 లక్షల మంది ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు...

కర్ణాటకలో ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ ఉపాధ్యాయుల చేయూత

  • విరాళంగా ఒక రోజు వేతనం రూ.20 కోట్లు


బెంగళూరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ప్రైవేటు టీచర్లను ఆదుకోవడానికి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఒకరోజు వేతనం రూ.20 కోట్లను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 1.40 లక్షల మంది ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వీరిలో చాలా మందికి 3 నెలలుగా జీతాలు రాలేదు. తమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ప్రైవేటు టీచర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఏమీ చేయలేమని ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తోటి ఉపాధ్యాయులను ఆదుకోవడానికి కర్ణాటక రాష్ట్ర హౌస్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ముందుకు వచ్చింది. 


Updated Date - 2020-07-10T07:47:50+05:30 IST