రూ. కోటి వస్తాయన్న ఆశతో ఆ టీచర్ ఏం చేసిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-06-24T18:25:29+05:30 IST

ఓ ఉపాధ్యాయురాలు కోటి రూపాయల ఆశకు లక్ష రూపాయలు పోగొట్టుకుని లబోదిబోమంటోంది. 1947 నాటి ఒక రూపాయి నాణేలను విక్రయిస్తానంటూ ఆసక్తిగలవా రు సంప్రదించాలని ఈ ఉపా

రూ. కోటి వస్తాయన్న ఆశతో ఆ టీచర్ ఏం చేసిందో తెలిస్తే..


బెంగళూరు: ఓ ఉపాధ్యాయురాలు కోటి రూపాయల ఆశకు లక్ష రూపాయలు పోగొట్టుకుని లబోదిబోమంటోంది. 1947 నాటి ఒక రూపాయి నాణేలను విక్రయిస్తానంటూ ఆసక్తిగలవారు సంప్రదించాలని ఈ ఉపాధ్యాయురాలు ఇటీవల ఆన్‌లైన్‌లోని ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన చేశారు. ఆసక్తిగల వారు తనను సంప్రదించాలని మొబైల్‌ నెంబరు ఇచ్చారు. ఆమె నెంబరుకు ఇటీవల ఓ అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేసి అపురూపమైన పాత రూపాయి నాణేలను తాను కోటి రూపాయలకు కొనుగోలు చేస్తానని ఆశచూపాడు. అందుకు ఉపాధ్యాయురాలు కూడా సంతోషంతో అంగీకరించింది. కొద్దిసేపటికే అడ్వాన్సుగా కొంత డబ్బు పంపిస్తానని ఆమె మొబైల్‌కు ఓ నకిలీ స్ర్కీన్‌షాట్‌ పంపించాడు. ఎంతసేపైనా సదరు వ్యక్తి నుంచి అడ్వాన్సు రాకపోవడంతో సదరు వ్యక్తికి మళ్ళీ ఫోన్‌ చేసింది ఉపాధ్యాయురాలు. డీల్‌ ఇష్టమా కాదా అని అడిగింది. అయితే పెద్దమొత్తం పంపాలంటే నగదు బదిలీ సాధ్యం కాదని ఆర్‌బీఐ పన్ను వేస్తుందని నమ్మబలికి తనకు తక్షణం లక్ష రూపాయలు చెల్లిస్తే ఆర్‌బీఐ అనుమతులు తీసుకుని రూ.కోటి మొత్తాన్ని ఖాతాకు బదిలీ చేస్తానని నమ్మబలికాడు. దీంతో ఆమె తన రెండు మూడు బ్యాంకు ఖాతాలలోని నగదును అతడికి ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించింది. డబ్బు చెల్లించి వారమైనా అతడినుంచి ఎలాంటి స్పందన రాకపోవ డంతో మొబైల్‌కు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. దీంతో తాను మోసపోయినట్టు గుర్తించి వైట్‌ఫీల్డ్‌ సీఈఎన్‌ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. 


Updated Date - 2021-06-24T18:25:29+05:30 IST