క్రైస్తవుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-01-16T05:24:50+05:30 IST

రాష్ట్రంలోని క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

క్రైస్తవుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఒంగోలు (కార్పొరేషన్‌) జనవరి 15 : రాష్ట్రంలోని క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఒంగోలులోని పునీతమ్మ తెరిస్సా చ ర్చిలో క్రైస్తవ ప్రణాళిక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్‌ పాటిండ్ల సమ్యే ల్‌పాల్‌ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో కొందరు క్రైస్తవులను దూషిస్తున్నారని, తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, మత మార్పిడిలు చేయడం లేదన్నారు. అయితే ఏసుక్రీస్తు ప్రేమను బోధించ డమే తమ విధి అని చెప్పారు. ప్రభుత్వం పాస్టర్లకు ప్రకటించిన గౌరవ వేతనం వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పాస్టర్‌ జార్జి బిషప్‌పాపా, కిరణ్‌కుమార్‌, దయానందం మాట్లాడుతూ క్రైస్తవ కార్పొరేషన్‌ ఏర్పాటు చే సినప్పటికీ ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని, పాస్టర్లనే కార్పొరేషన్‌ పదవులలో నియమించడం ద్వారా తమ సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో కె.సామ్రాట్‌, కొమ్మూరి రవికుమార్‌, తేళ్ల ఇ మ్మానుయేలు, రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-16T05:24:50+05:30 IST