నాయీ బ్రాహ్మణులు, రజకులకు 15వేలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-04-10T07:09:25+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో వెనుకబడిన కులాల జీవనం దుర్భరంగా మారిందని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అత్యంత వెనుకబడిన కులాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు...

నాయీ బ్రాహ్మణులు, రజకులకు 15వేలు ఇవ్వాలి

 విజయవాడ, ఏప్రిల్‌ 9: లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో వెనుకబడిన కులాల జీవనం దుర్భరంగా మారిందని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అత్యంత వెనుకబడిన కులాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు ఇనుకొండ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 లక్షలమంది నాయీ బ్రాహ్మణులు, 25 లక్షలమంది రజకులు కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. నాయీ బ్రాహ్మణులు, రజకులకు కుటుంబానికి రూ.15వేలు అందించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-04-10T07:09:25+05:30 IST