నిరుద్యోగితపై రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలి : అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2020-04-10T21:46:43+05:30 IST

రోనా వైరస్ మహమ్మారికి కూడా రాజకీయం రంగు తేవడం దురదృష్టకరమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు.

నిరుద్యోగితపై రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలి : అఖిలేశ్ యాదవ్

లక్నో : కరోనా వైరస్ మహమ్మారికి కూడా రాజకీయం రంగు తేవడం దురదృష్టకరమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ‘‘కరోనాను రాజకీయం చేడయం దురదృష్టకరం. రాజకీయంతో అసలు సిసలైన ప్రశ్నలు వెనక్కి పోతున్నాయి. మనుషులను క్వారంటైన్ చేయవచ్చు కానీ... ఆకలిని ఎవరూ క్వారంటైన్ చేయలేరు’’ అని ట్వీట్ చేశారు. దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా 93 శాతం మంది అసంఘటిత కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని తెలిపారు.


ఈమధ్య నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని, ఇదే ప్రస్తుత దేశాన్ని కలవరపెడుతోందని అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే ఓ కార్యాచరణను ప్రకటించాలని, లేదంటే ఆకలి కారణంగా దేశంలో సమస్యలు విజృంభిస్తాయని ఆయన హెచ్చరించారు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఆహారం, మందులతో పాటు నిత్యావసరాలు అందేలా ప్రభుత్వాలు చూడాలని అఖిలేశ్ సూచించారు. 

Updated Date - 2020-04-10T21:46:43+05:30 IST