గంట కొట్టేశారు

ABN , First Publish Date - 2022-08-07T05:34:13+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది వందల్లో కాదు.. వేలల్లో.. విద్యార్థులు బయటకు వెళ్లిపోయారు.

గంట కొట్టేశారు

ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటుకు మారిన విద్యార్థులు 19,832 

గత ఏడాది చదివింది.. లక్షా 38 వేల 863 మంది

ఈ ఏడాది చదువుతున్నది 1,19,031 మందే

విలీనం పేరిట స్కూళ్ల ఎత్తివేత.. ఫలితాల ప్రభావం

ఆకర్షించని నాడు–నేడు.. 

పిల్లలకు అనుకూలంగా లేని స్కూళ్లు

టీచర్ల సంఖ్య తగ్గింపునకు ప్రభుత్వం ఎత్తుగడ

విద్యా వ్యవస్థపై పెను ప్రభావం


విద్యా విధానం మెరుగులు దిద్దాం.. పాఠశాలలను ఆకర్షణగా చేశాం.. విధి విధానాల్లో ఎన్నో మార్పులు చేశాం.. అన్ని ఇస్తున్నాం.. అంటూ ప్రభుత్వ ఆర్భాటపు ప్రచారం విద్యార్థులను ఆకట్టుకోలేనట్లే కనిపిస్తోంది. అందుకనేమో ప్రభుత్వ ఉచిత విద్య వదిలి ప్రైవేటు విద్య వైపు చూసేలా చేసిందనే భావించాల్సి వస్తోంది. ఈ ఏడాది ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య వేలల్లో తగ్గింది. ప్రభుత్వం నాణ్యమైన విద్య అందిస్తుంటే మరి అసలు లోపం ఎక్కడుందన్నది ప్రశ్నగా మారింది.


భీమవరం ఎడ్యుకేషన్‌/తణుకు, ఆగస్టు 6 :  ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది వందల్లో కాదు.. వేలల్లో.. విద్యార్థులు బయటకు వెళ్లిపోయారు. జిల్లాలో 2022–23 విద్యా సంవత్సరానికి 1,415 ప్రభుత్వ పాఠశాలల్లో  లక్షా 19 వేల 031 మంది, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 3,731 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో లక్షా 38 వేల 863 మంది, ఎయిడెడ్‌లో 4,368 మంది చదివారు. ఆ లెక్కన గతేడాదికి ఈ ఏడాదికి 19 వేల 832 మంది విద్యార్థులు తగ్గారు. నాడు–నేడుతో రూ.కోట్లు ఖర్చు చేసి అన్ని పాఠశాలలో సౌకర్యాలు పెంచామని ప్రభుత్వం చెబుతున్నా ఆ ప్రచారం విద్యార్థులను ఆకర్షించలేదు. విద్యా విధానంలో రోజుకో నిర్ణయం విద్యార్థులకు ఇబ్బందిగా మారడంతో తల్లిదండ్రులు ప్రైవేటు వైపు చూసేలా చేసిందని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు వదిలి ప్రైవేటు విద్యా సంస్థల వైపు విద్యార్థులు భారీగా వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే అన్ని ఉచితమే.. అయినా ప్రైవేటు వైపే మొగ్గు చూపడం గమనార్హం. 2021–22 పదో ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బాగా వెనుకబడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో 13,616 మంది పరీక్ష రాయగా 5,325 మందే ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు పాఠశాలల్లో 7,562 మందికి 6,587 మంది పాస్‌ అయ్యారు. విద్యార్థులు తల్లిదండ్రులలో ఇది ఒకింత భయాన్ని కలిగించి ప్రైవేటుకు మొగ్గు చూపేలా చేసింది. పాఠశాలల విలీనం ఈ ఏడాది చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో 136 పాఠశాలల విలీనం ధర్నాలు, నిరసనలు జరగడం వచ్చే ఏడాది మరిన్ని విలీనం చేస్తారో అన్న భయం నెలకొంది. విలీనంలో వేల మంది విద్యార్థులు అవ స్థలు పడడం తల్లిదండ్రులకు గుణపాఠంగా మారింది. 

జిల్లాలో 136 ప్రాథమిక పాఠశాలలు ఉన్నత పాఠశాలల్లో విలీనమ య్యాయి. వీటిలో 14 స్కూళ్ల విలీనంపై ఫిర్యాదులు రావడంతో పరిశీ లనకు కమిటీ నియమించారు. ప్రధానంగా 24 ప్రాథమిక పాఠశాల లను 17 ప్రాథమికోన్నత పాఠశాలల్లోను, 87 ప్రాథమిక పాఠశాలలను 77 ఉన్నత పాఠశాలల్లోను, 25 ప్రాథమికోన్నత పాఠశాలలను 22 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. విలీన మైన పాఠశాలలకు విద్యార్థులు వెళ్లలంటే వంతెనలు, జాతీయ రహదారులు అడ్డంకిగా ఉన్నందున తల్లిదండ్రులు, ప్రజా ప్రతి నిధుల ఫిర్యాదుల మేరకు తొమ్మిది ప్రాథమిక పాఠశాలలను, ఐదు ప్రాథమికోన్నత పాఠశాలల వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు కమిటీని నియమించారు. నిర్ణయం వెలువడాల్సి ఉంది.

 

అన్నీ సమస్యలే..

స్కూళ్లను విలీనం చేసినప్పటికి క్షేత్రస్థాయిలో సమస్యలను పట్టిం చుకోవడం లేదు. ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిషు మీడియం ఉండేవి. ప్రస్తుతం ఇంగ్లిషు మీడియం ఒక్కటే ఉంది. ప్రాథమిక పాఠ శాలల్లో 30 మందికిపైగా విద్యార్థులు ఉంటే రెండు సెక్షన్లు ఉండేవి. హైస్కూల్‌లో 53 మంది వరకు ఒకటే సెక్షన్‌ ఇస్తున్నారు. గతంలో రెండు మాధ్యమాల్లో చదివిన విద్యార్థులు ఇప్పుడు కేవలం ఇంగ్లిషు మీడియంలోనే చదవాలి. 53 మంది విద్యార్థులు ఒకటే సెక్షన్‌ కాబట్టి ఒక ఉపాధ్యాయుడితో సరిపోతుంది. మరొకరిని మిగులుగా చూపిస్తు న్నారు. చాలాచోట్ల విలీనమైన ఉన్నత పాఠశాలల్లో  అవసర మైన సౌ కర్యాలు లేవు. నాడు నేడు పథకంలో చాలాచోట్ల స్కూళ్లను అభివృద్ధి చేసినా విలీనం తర్వాత ఆయా స్కూళ్లను వినియోగించు కోలేని పరి స్థితి. కొన్నిచోట్ల విలీనమైనా పాత స్కూల్లోనే తరగతులు జరుపుతు న్నారు. ఎండీఎం షెడ్లు, మరుగుదొడ్లు సరిగా అందుబాటులో లేవు.


టీచర్ల సంఖ్య తగ్గింపు ఎత్తుగడ

టీచర్ల సంఖ్యను తగ్గించుకునే ఎత్తుగడలో భాగంగానే విలీన ప్రక్రియను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికే ఎయిడెడ్‌ నుంచి ఐదు వేల మంది టీచర్లను తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేశారు. మరో 25 వేల మంది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 30 వేల ఉద్యోగాలు డీఎస్సీ ద్వారా ఎస్జీటీ పోస్టు లు తీయాల్సి ఉంది. కాని ప్రైమరీ స్కూళ్ల విలీనం పేరుతో ఉపాధ్యా యులను తగ్గించడమే ప్రభుత్వ అసలు ఉద్దేశం. మరో వైపు స్థానికంగా ఉన్న అంగన్‌వా డీలను ప్రైమరీ స్కూళ్లకు అనుసంధానం చేస్తామని చెబుతున్నారు. ఇప్పటి వరకు అంగన్‌వాడీలకు ప్రీ ప్రైమరీ శిక్షణ ఇచ్చిన దాఖ లాలు లేవు. ఇలా ఎటు చూసినా విద్యా వ్యవస్థ తీవ్ర గంద రగోళంలో పడింద ని సర్వత్రా ఆందో ళన వ్యక్తమవు తోంది. 


పిల్లలు చదువుకు దూరం  

ప్రభుత్వ విధానాల వల్ల విద్యార్థులు ప్రాథ మిక విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువ దూరం స్కూలుకు పంపలేక చదువు మానిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల బాల కార్మిక వ్యవస్థ పెరుగుతుంది. మరోవైపు ఎస్జీటీ పోస్టులుండవు. దీనివల్ల ప్రైమరీ స్కూళ్లు మూతపడతాయి. రానున్న రోజుల్లో టీచర్ల నియామకాలు ఉండవు.

– బీవీ నారాయణ, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

టీచర్ల తగ్గింపులో భాగమే

ప్రస్తుత విలీన ప్రక్రియను చూస్తే రానున్న రోజుల్లో టీచర్లను తగ్గించడమే ప్రధాన ఉద్దేశం. వేలాది పోస్టులు ఖాళీలున్నా ఒక్క పోస్టు భర్తీ చేయడం లేదు. ఉన్న ఉద్యోగాలను సర్దుబాటు పేరుతో భారం మోపుతున్నారు. ఇదే కొనసాగి తే రానున్న రోజుల్లో మూడు కిలోమీటర్ల దూరంలోని స్కూళ్లను విలీనం చేయడం ఖాయం.  

– బీఏ సాల్మన్‌రాజు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

Updated Date - 2022-08-07T05:34:13+05:30 IST