ఎన్నికల కమిషనర్‌పై ఏపీ గురి

ABN , First Publish Date - 2020-04-11T04:12:17+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ పదవీకాలం, జీతభత్యాల నియమ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా నియమింపబడేందుకు అర్హుడని ప్రభుత్వం విడుదల

ఎన్నికల కమిషనర్‌పై ఏపీ గురి

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ పదవీకాలం, జీతభత్యాల నియమ నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా నియమింపబడేందుకు అర్హుడని ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలిపారు. ఎన్నికల కమీషనర్‌ పదవీకాలం మూడేళ్లు ఉండాలని, గరిష్టంగా రెండు పర్యాయాలు (ఆరేళ్లు) పదవిలో కొనసాగే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌కు హైకోర్టు న్యాయమూర్తి స్థాయి హోదా లభిస్తుందని తెలిపిన ప్రభుత్వం.. హైకోర్టు జడ్జెస్‌ యాక్ట్‌ 1954 ప్రకారం అలవెన్స్‌లు, జీత భత్యాలు అందుతాయంటూ గెజిట్ విడుదల చేసింది.











Updated Date - 2020-04-11T04:12:17+05:30 IST