మళ్లీ లాక్‌డౌన్ అని అనడంతో.. రోడ్లపైకి వచ్చిన ప్రజలు..ఎక్కడంటే!

ABN , First Publish Date - 2020-07-09T06:20:33+05:30 IST

కరోనాను కట్టడి చేయడం కోసం సెర్బియా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపట్ల ఆ దేశ పౌరులు భగ్గుమన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రో

మళ్లీ లాక్‌డౌన్ అని అనడంతో.. రోడ్లపైకి వచ్చిన ప్రజలు..ఎక్కడంటే!

బెల్‌గ్రేడ్: కరోనాను కట్టడి చేయడం కోసం సెర్బియా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంపట్ల ఆ దేశ పౌరులు భగ్గుమన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిన ప్రజలు.. ఏకంగా పార్లమెంట్‌నే ముట్టడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలన్నీ స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయాయి. ఇదే సమయంలో సెర్బియా ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ అమలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొంత ఫలించాయి. దీంతో లాక్‌డౌన్ అంక్షలను సడలించింది. కాగా.. గత కొద్ది రోజులుగా క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో.. మళ్లీ లాక్‌డౌన్ విధించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో వారాంతంలో బెల్‌గ్రేడ్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించినున్నట్లు సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వ్యూసిక్ మంగళవారం రోజు ప్రకటించారు. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రజలు.. రోడ్లపైకి ఎక్కి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నిరసనలు చేశారు. పార్లమెంట్ ఆవరణలోకి చొచ్చుకుపోయారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో దాదాపు 43 మంది పోలీసులు, 17 మంది నిరసనకారులు గాయపడ్డారు. ఈ నిరసనలపై అలెగ్జాండర్ వ్యూసిక్ స్పందించారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి గుమికూడటం వల్ల కరోనా విజృంభించే అవకాశం ఉన్నందున.. నిరసనల్లో పాల్గొనవద్దని ప్రజలకు సూచించారు. 


Updated Date - 2020-07-09T06:20:33+05:30 IST