అశ్లీలతకు ప్రభుత్వం పట్టం

ABN , First Publish Date - 2022-08-06T05:30:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అశ్లీలతకు పట్టం కడుతోందని ఐద్వా రాష్ట్ర కోశాఽధికారి బి. సావిత్రమ్మ విమర్శించారు.

అశ్లీలతకు ప్రభుత్వం పట్టం
మహాసభలో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర కోశాఽధికారి సావిత్రమ్మ

ఐద్వా రాష్ట్ర కోశాఽధికారి సావిత్రమ్మ 

 కోవూరు, ఆగసు 6: రాష్ట్ర ప్రభుత్వం అశ్లీలతకు పట్టం కడుతోందని ఐద్వా రాష్ట్ర కోశాఽధికారి బి. సావిత్రమ్మ విమర్శించారు. పడుగుపాడులోని పుచ్చలపల్లి సుందరయ్య కల్యాణమండపంలో శనివారం జరిగిన  ఐద్వా 15వ జిల్లా మహాసభల్లో ఆమె ముఖ్య అతిఽథిగా మాట్లాడారు. మహిళలపై గౌరవం పెంచే సామాజిక వాతావరణాన్ని ప్రభుత్వం చేపట్టలేదన్నారు. మద్యపాన నిషేధం చేస్తామని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్‌రెడ్డి మద్యానికి టార్గెట్లు విధించి విక్రయిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి  వచ్చాక దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని బీజేపీ ప్రభుత్వం బహిరంగంగానే వ్యతిరేకిస్తోందన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, మహిళా వ్యతిరేక విధానాల్ని  నాయకులు, కార్యకర్తలు నిరసించాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కమిటీ ఏర్పడింది. అధ్యక్ష ప్రధానకార్యదర్శులుగా శివకుమారి, షేక్‌ మస్తాన్‌బీ ఎన్నికయ్యారు.

Updated Date - 2022-08-06T05:30:00+05:30 IST