50 శాతం విద్యార్థుల హాజరుతో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-07-07T11:40:52+05:30 IST

బీహార్ ప్రభుత్వం ఈనెల 12 నుంచి...

50 శాతం విద్యార్థుల హాజరుతో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం

పట్నా: బీహార్ ప్రభుత్వం ఈనెల 12 నుంచి అన్ని విద్యాసంస్థలను తెరిచేందుకు అనుమతినిచ్చింది. ఇంతేకాదు 11, 12 తరగతుల విద్యార్థులు 50 శాతం మేరకు పాఠశాలలకు హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. కరోనా పరిస్థితులను సమీక్షించిన అనంతరం  అన్ని సంస్థలను యధావిధిగా తెరిచేందుకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నామని, అయితే టీకా తీసుకున్నవారు కార్యాలయాలకు యధావిధిగా హాజరు కావచ్చని తెలిపారు. 


యూనివర్శిటీలు, కాలేజీలు, సాంకేతిక విద్యాసంస్థలు, ప్రభుత్వ శిక్షణ సంస్థలను ఈనెల 12 నుంచి 50 శాతం విద్యార్థుల సామర్థ్యంలో తెరుచుకోవచ్చని తెలిపారు. ఇదేవిధంగా రెస్టారెంట్‌లను కూడా 50 శాతం సిట్టింగ్ సామర్థ్యంతో తెరుచుకోవచ్చన్నారు. అయితే కరోనా ప్రొటోకాల్ పాటించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-07T11:40:52+05:30 IST