Viral News: కోపంగా ఉన్న భార్యను శాంతింపజేసేందుకు లీవ్ కోరిన ప్రభుత్వాధికారి!

ABN , First Publish Date - 2022-08-04T16:14:00+05:30 IST

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు సర్వసాధారణమే. చిన్న చిన్న విషయాలకే బుంగమూతులు పెట్టిన భార్యలను.. కోపం తగ్గిన తర్వాత భర్తలు బుజ్జగిస్తూ ఉంటారు. ఇపుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిదం

Viral News: కోపంగా ఉన్న భార్యను శాంతింపజేసేందుకు లీవ్ కోరిన ప్రభుత్వాధికారి!

ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు సర్వసాధారణమే. చిన్న చిన్న విషయాలకే బుంగమూతులు పెట్టిన భార్యలను.. కోపం తగ్గిన తర్వాత భర్తలు బుజ్జగిస్తూ ఉంటారు. ఇపుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిదంటే.. అలకబూని పుట్టింట్టికి వెళ్లిన భార్యను తిరిగి ఇంటికి తెచ్చుకోవడం కోసం ఓ ప్రభుత్వ ఉద్యోగి (Govt Officer) తన ఉన్నతాధికారులకు లీవ్(leave letter) కోరాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన లెటర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఉత్తరప్రదేశ్‌కు(Uttar pradesh) చెందిన శంషాద్ అహ్మద్‌.. ప్రభుత్వ అధికారి. ప్రేమ్‌నగర్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (BDO) కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆయనకు కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో వారి సంసార జీవితం బాగానే సాగినా.. తర్వాత మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా అహ్మద్ దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో అతడి భార్య అలకబూనింది. పిల్లలతో తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన తర్వాత కానీ.. భార్య విలువ అతడికి అర్థమైంది. ఇంటి పనులు చేసుకుని.. ఉద్యోగానికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నాడు. అదే విషయాన్ని తన లీవ్ లెటర్‌(leave letter)లో పేర్కొన్నాడు. 


‘చిన్న గొడవ కారణంగా నా భార్య(Angry Wife) అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె అలా వెళ్లినప్పటి నుంచి నేను మానసికంగా చాలా కుంగిపోయాను. ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఊరెళ్లాలి. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. లీవ్ లెటర్‌ను ఆమోదించండి’ అంటూ తన ఉన్నతాధికారికి లెటర్ రాశాడు. ఈ లెటర్ ప్రస్తుతం నెట్టింటికి చేరింది. దీంతో వైరల్‌గా మారింది. 


Updated Date - 2022-08-04T16:14:00+05:30 IST