అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు 7 రోజుల quarantine తప్పనిసరి

ABN , First Publish Date - 2022-01-11T14:27:27+05:30 IST

దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి కేంద్రప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది....

అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు 7 రోజుల quarantine తప్పనిసరి

నేటి నుంచి అమలు...కేంద్రం తాజా ఉత్తర్వులు 

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి కేంద్రప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు  రోజులపాటు క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒమైక్రాన్ వేరియెంట్‌ ప్రభావంతో  పాటు దేశంలో 1.8 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఫ్రంట్ లైన్ కార్మికులు, 60 ఏళ్లు పైబడిన వారికి ముందుజాగ్రత్తగా బూస్టర్ డోసు వేయడం ప్రారంభించారు.అమెరికాలో ఒక్కరోజే 1,32,646 మంది కరోనా రోగులు ఆసుపత్రుల్లో చేరిన దృష్ట్యా విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే ప్రయాణికులకు 7 రోజుల పాటు క్వారంటైన్ ను తప్పనిసరి చేశారు. 


Updated Date - 2022-01-11T14:27:27+05:30 IST