గూగుల్‌, ఫేస్‌బుక్‌లపై నియంత్రణ ?

ABN , First Publish Date - 2020-07-14T07:24:52+05:30 IST

ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి సంస్థలపై నియంత్రణ యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అలాంటి సంస్థల కార్యకలాపాల్లో ఆన్‌లైన్లో గోప్యత, ఆదాయార్జన, సమాచార మార్పిడి వంటి డేటా పర్యవేక్షణకు ఒక నియంత్రణ సంస్థ అవసరమని కేంద్రం...

గూగుల్‌, ఫేస్‌బుక్‌లపై నియంత్రణ ?

  • నిపుణుల కమిటీ సిఫారసు


న్యూఢిల్లీ, జూలై 13: ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి సంస్థలపై నియంత్రణ యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అలాంటి సంస్థల కార్యకలాపాల్లో ఆన్‌లైన్లో గోప్యత, ఆదాయార్జన, సమాచార మార్పిడి వంటి డేటా పర్యవేక్షణకు ఒక నియంత్రణ సంస్థ అవసరమని కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఫేస్‌బుక్‌, అమెజాన్‌, ఉబర్‌, గూగుల్‌కు మాతృసంస్థ అల్ఫాబెట్‌లు నెట్వర్క్‌ లబ్ధిదారులుగా తొలి తరం ప్రయోజనాలు పొందాయని తెలిపింది. అలాంటి పరిస్థితులను నివారించడమే నూతన నియంత్రణ సంస్థ ప్రధాన ఉద్దేశంగా ఉండాలని సూచించింది.


Updated Date - 2020-07-14T07:24:52+05:30 IST