ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా 3 ఎల్జీపీ సిలెండర్లు..?

ABN , First Publish Date - 2021-03-07T20:10:02+05:30 IST

వంట గ్యాసు ధరల పెంపుతో గృహ వినియోగదారుల్లో పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో..

ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా 3 ఎల్జీపీ సిలెండర్లు..?

న్యూఢిల్లీ: వంట గ్యాసు ధరల పెంపుతో గృహ వినియోగదారుల్లో పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం పావులు కదుపుతోంది. ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు తిరిగి 2022 ఆర్ధిక సంవత్సరంలో ఉచితంగా 3 ఎల్పీజీ సిలెండర్లు (వరుసగా 3 నెలలు) ఇచ్చే ఆలోచనలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. 14.3 కేజీల సిలెండర్ ధర గత జనవరి నుంచి రూ.125 వరకూ పెరిగింది. నిరంతరాయంగా పెరుగుతున్న ధరలతో జనవరిలో రూ.694 ఉన్న ఎల్‌పీజీ సిలెండర్ రూ.819కు చేరింది. దేశరాజధానిలో 2020 మే నుంచి వంటగ్యాసు ధర రూ.237.50 పెరిగింది.


కోవిడ్ భయాల ప్రభావం ఇప్పటికీ దేశంపై ఉన్నందున 2022 ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్రం కొన్ని ఉద్దీపన చర్యలు తీసుకోనుందని, దీనిపై ప్రకటన చేసే సమయంలో ఉజ్వల లబ్ధిదారులకు ఉచిత ఎల్పీజీ సిలెంటర్ల ప్రకటన చేయవచ్చని అనధికార వర్గాలు చెబుతున్నాయి. 2021-22 బడ్జెట్‌లోనూ రాబోయే రెండేళ్లలో అదనంగా 10 మిలియన్ ప్రజలకు ఉజ్వల స్కీమ్‌తో లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2021-03-07T20:10:02+05:30 IST