ఈ నెల 29 న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు:మంత్రి తలసాని

ABN , First Publish Date - 2022-04-28T20:02:28+05:30 IST

పవిత్ర రంజాన్ సందర్భంగా ఈనెల 29న ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

ఈ నెల 29 న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు:మంత్రి తలసాని

హైదరాబాద్: పవిత్ర రంజాన్ సందర్భంగా ఈనెల 29న ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈమేరకు ఎల్బిస్టేడియంలో పెద్దయెత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.మంత్రి తలసానితో పాటు హోంశాఖ మంత్రి మహమూద్అలీ గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం లు నెలరోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నిమతాల పండగలను ప్రభుత్వం నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో పండుగలా ఇఫ్లార్ విందును ఏర్పాటుచేస్తున్నట్టు మంత్రి తెలిపారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఇఫ్తార్ విందుకు వచ్చే ప్రతినిధులకు ప్రత్యేక పాస్ లను జారీ చేసినట్టు తెలిపారు.రంజాన్ సందర్భంగా పేద ముస్లీం లకు ప్రభుత్వం తరపున దుస్తులను కూడా పంపిణీ చేస్తున్నామని చెప్పారు.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. ఎల్బీస్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందుకుముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని అన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. 

Updated Date - 2022-04-28T20:02:28+05:30 IST