ప్రభుత్వ ఉద్యోగుల గుండెలపై నల్లబ్యాడ్జీ

ABN , First Publish Date - 2021-12-08T05:18:51+05:30 IST

తెల్లకోటు, స్టెత్‌తో కనిపించే డాక్టర్లు, వైద్య సిబ్బంది.. పెన్ను, పుస్తకాలు, చాక్‌పీస్‌, డస్టర్‌తో కనిపించే టీచర్స్‌.. ఫైల్స్‌, కాగితాలు, కంప్యూటర్‌తో కుస్తీ పట్టే రెవెన్యూ సిబ్బంది.. గుండెలపై నల్ల బ్యాడ్జితో విధులకు హాజరయ్యారు.

ప్రభుత్వ ఉద్యోగుల గుండెలపై నల్లబ్యాడ్జీ
వేలేరుపాడు ప్రభుత్వాసుపత్రి వద్ద వైద్య సిబ్బంది నిరసన

తెల్లకోటు, స్టెత్‌తో కనిపించే డాక్టర్లు, వైద్య సిబ్బంది.. పెన్ను, పుస్తకాలు, చాక్‌పీస్‌, డస్టర్‌తో కనిపించే టీచర్స్‌.. ఫైల్స్‌, కాగితాలు, కంప్యూటర్‌తో కుస్తీ పట్టే రెవెన్యూ సిబ్బంది.. గుండెలపై నల్ల బ్యాడ్జితో విధులకు హాజరయ్యారు. వారితోపాటు  మున్సిపల్‌, గిరిజన ప్రాంత ఉద్యోగులు, వివిధ శాఖల ఉద్యోగుల గుండె మండింది. ఉద్యోగులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపుతో పోరుబాట పట్టారు. పీఆర్‌సీ ప్రకటించాలని, డీఏ బకాయిలు చెల్లించాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని, కాంట్రాక్ట్‌ సిబ్బంది సర్వీసు క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు.



వేలేరుపాడు, డిసెంబరు 7: ఏపీజేఏసీ, అమరావతి ఐక్యవేదిక పిలుపు మేరకు వేలేరుపాడులోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల తో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా జేఏసీ పిలుపు మేర కు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్టు వైద్యాధికారి ఎండీ రహీమా నశ్రీన్‌ తెలిపారు. ఉద్యోగుల డిమాండ్‌లకు ప్రభుత్వం దిగి వచ్చి పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్రీకృష్ణుడు, తిరుమలకుమార్‌, తదితర సిబ్బంది పాల్గొన్నారు.


జంగారెడ్డిగూడెం: సీపీఎస్‌ రద్దు చేసి పీఆర్‌సీ వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఉద్యోగులు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద మంగళ వారం నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగులు ఎమ్మెల్యే వీఆర్‌.ఎలీజాకు వినతిపత్రాన్ని అందజేశారు. పంచాయ తీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కా గో పాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు పగడం నాగే శ్వరరావు, ఎన్జీవో డివిజన్‌ ఉపాధ్యక్షురాలు సత్యవేణి పాల్గొన్నారు.


చింతలపూడి: ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో మంగళవారం విధులకు హాజరయ్యారు. తాలూకా కన్వీనర్‌ ఎస్‌కె.అబ్రార్‌ హుస్సేన్‌ మాట్లా డుతూ 8, 9 తేదీల్లో కూడా నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తామన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.


గోపాలపురం: పీఆర్‌సీ, డీఏ, బకాయిలు చెల్లించే వరకు ఉద్యమాలు చెయ్యకతప్పదని ఏపీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. తహసీల్దార్‌  కార్యాలయం వద్ద  ఏపీ జేఏసీ,  ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక పిలుపు మేరకు మంగళవారం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రతీ నెల 1న పొందాల్సిన జీతాలు, పింఛన్లు సకాలంలో పొందలేని దుస్థితి నెలకొందన్నారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీ గాలిలో ఉంచిన ఘనత ప్రభుత్వానిదేనన్నారు. అధికారం అందే వరకు హామీలు గుప్పించి, అధికారంలో వచ్చాక వాటిని పక్కనపెట్టడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారిందన్నారు. ఉద్యోగుల సమస్యలతో పాటు పింఛనర్లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. పీఆర్‌సీ, డీఏలను చెల్లించేంత వరకు దశల వారీగా ఉద్యమాన్ని వివిధ రూపాల్లో కొనసాగిస్తామని హెచ్చ రించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాలు, పాల్గొన్నాయి.


చాగల్లు: ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు జడ్పీ ఉన్నత పాఠశాల ఉపా ధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ తక్షణం 11వ పీఆర్‌సీని అమలు చేయాలని, డీఏ బకాయిలు మంజూరు చేయాలని కోరారు. పాఠశాల ఉపాధ్యాయులందరూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:18:51+05:30 IST