Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ ఉద్యోగి భారీ స్కామ్.. చిన్న ట్రిక్‌తో కోట్లు కొట్టేశాడు..!

అహ్మదాబాద్: ‘కొడితే కుంభస్థలం కొట్టాలి’ అనే మాట విన్నారా..? అయితే ఆ మాటను కచ్చితంగా అమలు చేశాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఏకంగా కోట్ల రూపాయల స్వాహా చేశాడు. ఈజీ మనీ సంపాదించాలనే ఆలోచనలో పెద్ద స్కాంకు తెరతీశాడు. సొంత ఉద్యోగంతోనే ఫ్రాడ్ చేశాడు. నకిలీ పెయిడ్‌ లీవ్స్‌తో ఏకంగా రూ.10కోట్లు దండుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరా ప్రకారం.. రాజేష్ రామి అనే అహ్మదాబాద్ జిల్లాలోని ఓ ప్రాథమిక విద్యాశాఖలో డిప్యూటీ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. పెయిడ్ లీవ్స్‌తో భారీ మోసానికి పాల్పడ్డాడు. జిల్లాలోని 8 తాలూకాల్లోని ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయుల పేరుతో సుమారు 5000 నకిలీ పెయిడ్‌ లీవ్స్‌ను ప్రభుత్వానికి అప్లై చేశాడు. ఆ పెయిడ్‌ లీవ్స్‌ను రూ.9.99 కోట్ల మేర నగదుగా మార్చాడు. అనంతరం ఆ నగదును తన, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో వేసుకున్నాడు.

అయితే.. 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడు తాలూకాలు సమర్పించిన డాక్యుమెంట్లను తాజాగా అధికారులు ఆడిట్‌ చేయడంతో ఈ భారీ మోసం బయటపడింది. దీంతో అధికారులు ఈ నెల 15న రాజేష్ రామి చీటింగ్‌పై కరంజ్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఏడాది 2016-17 నుంచి 2020-21 మధ్యలో అతడు ఈ స్కామ్‌కు పాల్పడి ఉంటాడని, రెండు ఏళ్ల ఆడిట్‌లో తేలిన రూ.10 కోట్ల కంటే ఎక్కువగానే చీటింగ్ చేసి ఉంటాడని, ఈ స్కామ్‌లో మరికొందరి ప్రమేయం కూడా ఉండి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే కేసు నమోదైన తరువాత రాజేష్ రామి పరారయ్యాడు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement