దేశ భద్రతకు ముప్పు తెచ్చే 54 చైనీస్ యాప్‌లపై కేంద్రం నిషేధాస్త్రం

ABN , First Publish Date - 2022-02-14T17:32:41+05:30 IST

జాతీయ భద్రతకు ముప్పు కలిగించే 54 చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది....

దేశ భద్రతకు ముప్పు తెచ్చే 54 చైనీస్ యాప్‌లపై కేంద్రం నిషేధాస్త్రం

న్యూఢిల్లీ : జాతీయ భద్రతకు ముప్పు కలిగించే 54 చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది.ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం దేశ భద్రతకు ముప్పు కలిగించే 54 చైనీస్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.2020 జూన్ నెల నుంచి టిక్ టాక్, షేర్ ఇట్, వి ఛాట్, హెలో, లైకీ, బిగో లైవ్ తదితర 224 చైనీస్ స్మార్ట్ యాప్ లను ప్రభుత్వం నిషేధించింది.యాప్‌లలో బ్యూటీ కెమెరా, స్వీట్ సెల్ఫీ హెచ్‌డి, బ్యూటీ కెమెరా, సెల్ఫీ కెమెరా, ఈక్వలైజర్ అండ్ బాస్ బూస్టర్, క్యామ్‌కార్డ్ ఫర్ సేల్స్‌ఫోర్స్ ఎంట్, ఐసోలాండ్ 2: యాషెస్ ఆఫ్ టైమ్ లైట్, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ ఎక్స్‌రివర్, ఆన్‌మియోజీ చెస్, ఆన్‌మియోక్అరేనా డ్యూయల్ స్పేస్ లైట్ యాప్ లను నిషేధించింది.


కేంద్ర మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం 54 యాప్‌ల జాబితాలో ఇంతకుముందు కూడా భారత ప్రభుత్వం నిషేధించిన వాటిలో కొన్ని ఉన్నాయి. అయితే వాటినే రీబ్రాండ్ చేసి కొత్త పేర్లతో తిరిగి ప్రారంభించాయి. అధికారిక ధృవీకరణ తర్వాత యాప్‌లను నిషేధించాలని మరోసారి ఆదేశాలు జారీ చేశారు.ఈ యాప్‌లలో చాలా వరకు హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయడం లేదా వినియోగదారు సమ్మతి లేకుండానే చైనా ఆధారిత డేటా సెంటర్‌లకు నేరుగా యూజర్ సమాచారాన్ని పంపడం వంటివి ఉన్నాయని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.


Updated Date - 2022-02-14T17:32:41+05:30 IST