Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత మాజీ కెప్టెన్‌‌కు షాకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం

ముంబయి: భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. గతంలోని సర్కారు అతడికి కేటాయించిన భూమిని తిరిగి ఇవ్వాలని ఠాక్రే ప్రభుత్వం కోరింది. మహారాష్ట్ర గృహ నిర్మాణ, ప్రాంతీయాభివృద్ధి సంస్థ 1986లో సునీల్ గవాస్కర్ క్రికెట్ పౌండేషన్ ట్రస్ట్‌కు క్రికెట్ అకాడమీ నిమిత్తం 20వేల చదరపు అడుగుల భూమిని కేటాయించింది. 60ఏళ్ల లీజుకు ఈ భూమిని ఇచ్చింది. అప్పటి నుంచి ఆ భూమిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అందువల్ల ఆ భూమిని వెనక్కి తీసుకోవాలనే ఆలోచనలో ప్రస్తుత సర్కారు ఉంది.


మహారాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అహువాడ్ విలేకరులతో మాట్లాడుతూ..‘‘ రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన బాంద్రా(తూర్పు) ప్రాంతంలో ఈ భూమి ఉంది. అతడికి ఖరీదైన, విశాలమైన ప్రాంతంలో భూమిని కేటాయించినప్పటికీ  క్రికెట్ అకాడమీని అభివృద్ధి చేయలేదు. అందువల్ల ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. క్రికెట్ అకాడమీని నిర్మిస్తే ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకుంటుంది. అతడు క్రికెట్‌కు చేసిన సేవల దృష్ట్యా ఇప్పటివరకు ఆ భూమిని వెనక్కి తీసుకోలేదు’’ అని చెప్పారు.   

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement