ఓసీఐ కార్డుదారులకు తీపికబురు

ABN , First Publish Date - 2020-05-23T13:52:46+05:30 IST

ఓవర్సీస్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ) కార్డు కలిగి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు తీపికబురు.

ఓసీఐ కార్డుదారులకు తీపికబురు

న్యూఢిల్లీ, మే 22 : ఓవర్సీస్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ) కార్డు కలిగి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు తీపికబురు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన ఓసీఐ కార్డుదారులు భారత్‌ రావొచ్చు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. తాజాగా విదేశాల్లో చిక్కుకుపోయిన ఓసీఐ కార్డుదారులను భారత్‌కు వచ్చేందుకు కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చింది. కుటుంబసభ్యుల్లో ఎవరైనా మరణించడం వంటి అత్యవసర పరిస్థితుల్లో భారత్‌కు రావాలనుకొనే ఓసీఐ కార్డుదారులు ప్రయాణం చేయొచ్చు. భారత్‌లో శాశ్వత నివాసం కలిగి ఉన్న భార్యాభర్తల్లో ఒకరికి ఓసీఐ కార్డు ఉన్న పక్షంలో భారత్‌ వచ్చేందుకు వారిని అనుమతిస్తారు. విదేశీ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు ఓసీఐ కార్డు ఉంటే వారు భారత్‌ రావొచ్చు. అయితే వారి తల్లిదండ్రులు ఇక్కడ నివసిస్తూ ఉండాలి. 


Updated Date - 2020-05-23T13:52:46+05:30 IST