వ్యాక్సిన్‌ ఎలా పంపిణీ చేద్దాం?

ABN , First Publish Date - 2020-08-13T07:49:24+05:30 IST

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అడ్మినిస్ర్టేషన్‌ వ్యూహాలకు సంబంధించి ఏర్పాటైన జాతీయ నిపుణుల కమిటీ బుధవారం తొలిసారిగా సమావేశమైంది. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ సమీకరణ యంత్రాంగాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించింది...

వ్యాక్సిన్‌ ఎలా పంపిణీ చేద్దాం?

  • జాతీయ నిపుణుల కమిటీ విస్తృత చర్చ
  • రాష్ట్రాలు వ్యాక్సిన్‌ సేకరించొద్దు 

న్యూఢిల్లీ, ఆగస్టు 12: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌  అడ్మినిస్ర్టేషన్‌ వ్యూహాలకు సంబంధించి ఏర్పాటైన జాతీయ నిపుణుల కమిటీ బుధవారం తొలిసారిగా సమావేశమైంది. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ సమీకరణ యంత్రాంగాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించింది. దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యాక్సిన్‌ తయారీ, ప్రజలకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత, మార్గదర్శక సూత్రాలపై కూడా చర్చ జరిగింది. ఈ సమావేశానికి నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ అధ్యక్షత వహించగా.. ఆరోగ్యశాఖ సెక్రటరీ సహచైర్మన్‌గా ఉన్నారు. వ్యాక్సిన్‌ సమీకరణకు సంబంధించి రాష్ట్రాలు సొంత ఏర్పాట్లు చేసుకోవద్దని కమిటీ సూచించింది. మన దేశానికి అవసరమైన కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఎంపిక చేసేందుకు మార్గనిర్దేశం చేసే విస్తృత పారామితులపై కమిటీ చర్చ నిర్వహించింది. అంతేకాకుండా నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (ఎన్‌టీఏజీఐ)కు చెందిన స్టాండింగ్‌ సబ్‌ కమిటీ నుంచి సమాచారాన్ని కోరింది.


వ్యాక్సిన్‌ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌, డెలివరీ యంత్రాంగానికి సంబంధించిన డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటుపై కమిటీ చర్చించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనివల్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పక్కాగా ట్రాక్‌ చేయడానికేకాకుండా చిట్టచివరి వ్యక్తుల వరకు ఇది పంపిణీ అయ్యే లా చూడవచ్చని పేర్కొం ది. వ్యాక్సిన్‌ను అందించడానికి పెద్ద ఎత్తున నిధుల అవసరం ఉంటుంది. ఇందుకు సంబంఽధించిన వివిధ అంశాలపై కమిటీ చర్చించింది. వ్యాక్సిన్‌ను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అందించడానికి అవసరమైన వ్యూహం, తదుపరి కార్యాచరణ అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావన  వచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాక్సిన్‌ భద్రత, నిఘా తదితర అంశాలపై కూడా చర్చ సాగినట్టు పేర్కొంది. 

Updated Date - 2020-08-13T07:49:24+05:30 IST