Abn logo
Sep 25 2021 @ 01:13AM

ఎలమంచిలి ఎంపీపీగా గోవింద్‌ ఏకగ్రీవం

ఎలమంచిలి ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను అభినందిస్తున్న ఎమ్మెల్యే కన్నబాబురాజు

ఎలమంచిలి, సెప్టెంబరు 24 : ఎలమంచిలి ఎంపీపీగా పులపర్తి  ఎంపీటీసీ బోదెపు గోవింద్‌, వైస్‌ ఎంపీపీగా  రేగుపాలెం ఎంపీటీసీ రాజాన సూర్యచంద్రశేషగిరిరావు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రిసైడింగ్‌ అధికారి దాసు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. కో-ఆప్షన్‌ సభ్యుడుగా సిద్దా నూకేశ్వరరావును సభ్యులంతా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు కార్యవర్గాన్ని అభినందించి, మండలాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారిగా ఎంపీడీవో సత్యనారాయణ పాల్గొన్నారు.  వైసీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దపు యర్రయ్యదొర, జడ్పీటీసీ సంధ్యారాణి, రంగాసాయి, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, అర్రెపు గుప్తా, ఏఎంసీ చైర్మన్‌ అప్పలనర్స తదితరులు అభినందించారు. 

అచ్యుతాపురం ఎంపీపీగా సంధ్య

అచ్యుతాపురం : అచ్యుతాపురం ఎంపీపీగా పెదపాడు ఎంపీటీసీ కోల సంధ్య, వైస్‌ ఎంపీపీగా పూడిమడక-2 ఎంపీటీసీ వాసుపల్లి పద్మావతి ఎన్నికయ్యారు. కో- ఆప్షన్‌ సభ్యుడుగా పూడిమడక మత్స్యకార నాయకుడు చేపల శ్రీరాములును ఎన్నుకున్నారు.  మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకోవడంతో  వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు, ఆర్‌వో చిన్నం నాయుడు, ఎంపీడీవోవో కృష్ణతో పాటు వైసీపీ నాయకులు వీరిని అభినందించారు. 

రాంబిల్లి ఎంపీపీగా శిరీషా 

రాంబిల్లి : రాంబిల్లి మండలాధ్యక్షరాలుగా రాంబిల్లి ఎంపీటీసీ గొట్టుముక్కల శిరీషా, వైఎస్‌ ఎంపీపీగా దిమిలి ఎంపీటీసీ కొటాపు లక్ష్మి ఎన్నికయ్యారు. కో-ఆప్షన్‌ సభ్యుడుగా వాడనర్సాపురం ఎంపీటీసీ చింతకాయల పెంటయ్యను ఎన్నుకున్నారు. అంతకుముందు ఎంపీటీసీలతో  ఎన్నికల అధికారి భాస్కరరావు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబురాజు వీరిని అభినందించి, మండలాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దాలని సూచించారు. డీసీసీబీ మాజీ చైర్మన్‌ సుకుమార్‌వర్మ, ఎంపీడీవో కొండలరావు, జడ్పీటీసీ డి.నాగరాజు, వైసీపీ నాయకులు జి.శ్రీనుబాబు, డి.ఎస్‌.ఎన్‌.రాజు, జి. హుజూర్‌చర్‌ రాజు, మాజీ సర్పంచ్‌ పి.కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

మునగపాక ఎంపీపీగా జయలక్ష్మి

మునగపాక : మునగపాక ఎంపీపీగా మళ్ల జయలక్ష్మి, వైస్‌ ఎంపీపీగా బోజా లక్ష్మి ఎన్నికయ్యారు. కో-ఆప్షన్‌ సభ్యుడుగా మరిసా రమణను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి యతిరాజులు, ఎంపీడీవో ఉదయశ్రీ వీరితో ప్రమాణం చేయించారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు.  పలువురు అధికారులతో పాటు వైసీపీ నాయకులు వీరిని అభినందించారు.