TS News: బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో కలియతిరిగిన గవర్నర్

ABN , First Publish Date - 2022-08-07T16:08:38+05:30 IST

నిర్మల్: గవర్నర్ తమిళి సై బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో కలియతిరిగారు. విద్యా బోధన, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. హాస్టల్ గదులు, వాష్‌రూంలను పరిశీలించారు. హాస్టల్ సమస్యలతో పాటు

TS News: బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో కలియతిరిగిన గవర్నర్

నిర్మల్: గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ (Basara IIIT)లో కలియతిరిగారు. విద్యా బోధన, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. హాస్టల్ గదులు, వాష్‌రూంలను పరిశీలించారు. విద్యార్థులు హాస్టల్ సమస్యలతో పాటు అకాడమిక్ సమస్యలను గవర్నర్ దృష్టికి తెచ్చారు. అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు. సమస్యలున్నాయని.. చదువును నిర్లక్ష్యం చేయకూడదని విద్యార్థులకు గవర్నర్ సూచించారు. క్రమ శిక్షణ‌తో కూడిన స్వేచ్ఛ, స్నేహ పూర్వక వాతావరణం కల్పించాలని  వీసీ,సిబ్బందికి సూచించారు.


బాసర ట్రిపుల్ ఐటీలో సరైన వసతులు లేవని, భోజనశాల నిర్వహణ బాగోలేదని విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల ఆహారం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్‌ తమిళి సైకి స్టూడెంట్స్ గవర్నింగ్ కౌన్సిల్ ట్వీట్ చేసింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరడంతో గవర్నర్‌ ఆదివారం ఉదయం బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. 

Updated Date - 2022-08-07T16:08:38+05:30 IST