Abn logo
Aug 2 2020 @ 16:49PM

గవర్నర్‌ తమిళిసై రాఖీపండగ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: రక్షాబంధన్‌ (రాఖీపండగ) సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్ర ప్రజలకు శుఖాకాంక్షలు తెలిపారు. సోమవారం రక్షాబంధన్‌ను ఘనంగా నిర్వహించుకునేందుకు మహిళలు, యువతులు సిద్ధమవుతున్నారు. ఈసందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో అన్నాచెల్లెళ్లకు ఉన్న బంధం ఎంతో పవిత్రమైందని అన్నారు. సోదర బంధం మరింత బలంగా ఉండేందుకు చెల్లెళ్లు అన్నయ్యలకు రాఖీలు కడతారు. సోదరులుఎంతో అభిమానంతో చెల్లెళ్లను ఆశీర్వదించడం అనవాయితీ. ప్రధాన మంత్రి ఇచ్చిన బేటీబచావో బేటీ పడావో పిలుపు స్పూర్తితో ఈసారి రక్షాబంధన్‌ను మరంత ఘనంగా జరుపుకోవాలని గవర్నర్‌ కోరారు. సోదరీమణులకు అన్నయ్యలు ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పడమే ఈ పండగ ప్రాముఖ్యతగా గవర్నర్‌పేర్కొన్నారు. కరోనా నేపధ్యంలో జాగ్రత్తల మధ్య ఇంట్లోనే ఈ పండగను జరుపుకోవాలని కోరారు. 

Advertisement
Advertisement
Advertisement