తిరుమల: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.బుధవారం మధ్యాహ్నం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన గవర్నర్ ముందుగా ధ్వజస్తంభాన్ని తాకుతూ గర్భాలయంలోకి చేరుకుని శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. గవర్నర్‌ను రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వదించగా, ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు.