గౌరవప్రదమైన ప్రవర్తనకు మారుపేరు రోశయ్య

ABN , First Publish Date - 2021-12-05T08:54:05+05:30 IST

గౌరవప్రదమైన ప్రవర్తనకు, ప్రజానుకూల విధానాలకు రోశయ్య మారుపేరని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. రాజకీయాల్లో రోశయ్య ఆదర్శప్రాయులుగా నిలిచారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాసమస్యల విషయంలో నిరంతర పోరాటం చేస్తూనే ఓర్పు,

గౌరవప్రదమైన ప్రవర్తనకు మారుపేరు రోశయ్య

  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సంతాపం


న్యూఢిల్లీ, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): గౌరవప్రదమైన ప్రవర్తనకు, ప్రజానుకూల విధానాలకు రోశయ్య మారుపేరని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. రాజకీయాల్లో రోశయ్య ఆదర్శప్రాయులుగా నిలిచారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాసమస్యల విషయంలో నిరంతర పోరాటం చేస్తూనే ఓర్పు, నేర్పుతో తాను చేపట్టిన పదవులను సమర్థవంతంగా నిర్వహించారని, తమిళనాడు గవర్నర్‌గా కూడా హుందాగా వ్యవహరించారని ప్రశంసించారు. రోశయ్య తనకు చిరకాల మిత్రులని, సర్వజన హితాభిలాషి, చక్కని వక్త అని, నిరాడంబరంగా జీవించారని తెలిపారు. వివిధ అంశాలపై స్పష్టమైన విషయ పరిజ్ఞానం, ప్రసంగాల్లోనూ ఎవరినీ నొప్పించకుండానే విషయాన్ని సూటిగా, స్పష్టంగా తెలియజేయటంలో సిద్ధహస్తులుగా గుర్తింపు పొందారని, ఏకంగా 16 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా, ప్రజాసేవలో రోశయ్య కృషి చిరస్మరణీయమని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘రోశయ్య కన్నుమూయడం ఎంతో బాధాకరం. మేమిద్దం ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పుడు, ఆ తర్వాత ఆయన తమిళనాడు గవర్నర్‌గా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో మా సంభాషణలను గుర్తు చేసుకుంటున్నాను’ అని మోదీ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-05T08:54:05+05:30 IST