విద్యారంగాన్ని కాపాడుకుందాం

ABN , First Publish Date - 2020-07-05T07:59:17+05:30 IST

కొవిడ్‌ సంక్షోభంతో దెబ్బతిన్న విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

విద్యారంగాన్ని కాపాడుకుందాం

  • ‘కొవిడ్‌’ సంక్షోభం నుంచి దాన్ని గట్టెక్కిద్దాం: గవర్నర్‌

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ సంక్షోభంతో దెబ్బతిన్న విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. నాణ్యమైన విద్య, ఉద్యోగితా నైపుణ్యాల అభివృద్ధితోనే ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించగలమని, ఆ విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కొవిడ్‌ సంక్షోభం : విద్యారంగంపై ప్రభావం’’ అనే అంశంపై శనివారం నిర్వహించిన గ్లోబల్‌ వెబినార్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సంక్షోభ సమయంలోనూ విద్యార్థులు పరిమిత వనరులతోనే ఆన్‌లైన్‌లో విద్యాభ్యాసానికి ఉత్సాహం చూపారని గవర్నర్‌ ప్రశంసించారు.


ఆన్‌లైన్‌ తరగతులను 60 శాతం మంది విద్యార్థులే వినే పరిస్థితి ఉందని, మిగతా 40 శాతం మంది తరగతులకు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ వెబినార్‌ను లీడ్‌ ఇండియా ఫౌండేషన్‌ (అమెరికా విభాగం) చైర్మన్‌ డా.హరి ఎప్పనపల్లి నిర్వహించగా, ప్రారంభోత్సవంలో ముఖ్య వక్తగా రాష్ట్ర ఐటీ సెక్రెటరీ జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు. 17 దేశాల నుంచి వందలాది మంది ఈ వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-05T07:59:17+05:30 IST