తెలంగాణ గౌరవ ప్రతీక బతుకమ్మ: తమిళిసై

ABN , First Publish Date - 2020-10-24T08:46:45+05:30 IST

తెలంగాణ గౌరవ ప్రతీక బతుకమ్మ: తమిళిసై

తెలంగాణ గౌరవ ప్రతీక బతుకమ్మ: తమిళిసై

రాజ్‌భవన్‌ పరివార్‌ మహిళలకు చీరల పంపిణీ  


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి, దైవం, పుట్టిన గడ్డతో మహిళలు మమేకమయ్యే విశిష్ట సందర్భం బతుకమ్మ పండుగ అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలు ఇచ్చిపుచ్చుకునే నైవేద్యాలు ఆరోగ్యకరం, బలవర్థకమైనవని ఆమె తెలిపారు. బతుకమ్మ సందర్భంగా శుక్రవారం రాజ్‌భవన్‌ పరివార్‌కు చెందిన మహిళా ఉద్యోగులకు దర్బార్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మను పేర్చడానికి వినియోగించే పూలలో ఔషధ గుణాలున్నాయని, వాటి నిమజ్జనం ద్వారా చెరువుల్లోని నీరు శుద్ధి అవుతుందన్నారు. వచ్చే ఏడాది కరోనా రహిత పరిస్థితుల్లో బతుకమ్మ జరుపుకుంటామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరోనాపై అవగాహన పెంచేందుకు రాజ్‌భవన్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. 

Updated Date - 2020-10-24T08:46:45+05:30 IST