గిరిజనుల పౌష్టికాహార స్థితిగతులపై గవర్నర్‌ ఆరా

ABN , First Publish Date - 2021-03-05T22:50:21+05:30 IST

తెలంగాణలో గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహార స్థితిగతులను తెలుసుకుని తనకు వివరాలను ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ రాజ్‌భవన్‌ అధికారులను ఆదేశించారు.

గిరిజనుల పౌష్టికాహార స్థితిగతులపై గవర్నర్‌ ఆరా

హైదరాబాద్‌: తెలంగాణలో గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహార స్థితిగతులను తెలుసుకుని తనకు వివరాలను ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ రాజ్‌భవన్‌ అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ అనంతరం వారికి అందుతున్న పౌష్టికాహారంపై ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం పుదుచ్చేరి నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా తెలంగాణలోపరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో మహ్మారి ప్రభావం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను తాను స్వయంగా పరిశీలిస్తానని, పుదుచ్చేరి నుంచి రాష్ర్టానికి వచ్చాక ఆయా ప్రాంతాల్లోపర్యటిస్తానని అన్నారు.


గిరిజన ప్రాంతాల్లోని పరిస్థితులను తెలుసుకునేందుకు రాజ్‌భవన్‌ అధికారులు ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) అధికారులతో కూడా తనకు వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు న్యూట్రిషన్‌ సప్లిమెంట రీ ఫుడ్‌ను పంపిణీ చేసేందుకు నిపుణులు సహకరించాలని అన్నారు. ఈ మేరకు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌తరపునయువత వాలంటీర్ల సేవలను భాగస్వాములను చేయాలని కోరారు. 


Updated Date - 2021-03-05T22:50:21+05:30 IST