హైదరాబాద్: తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.రోశయ్య మృతితో దేశం ఒక గొప్ప అనుభవజ్ఞుడైన నాయకున్ని కోల్పోయిందని గవర్నర్ అన్నారు. వారి మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని,రాజకీయాలలో, ప్రజాజీవనంలో రోశయ్య అత్యున్నత ప్రమాణాలు పాటించారని, వారి ఆదర్శాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని గవర్నర్ తెలిపారు.